Monday, June 16, 2008

మరణం

మనస్సు మనిషిని వదిలి
అనుబంధాలను వదిలి
బాంధవ్యాలను విడిచి
మమతానురాగాలను మరిచి
మరో లోకాలకు విహరించడమే మిత్రమా!

మోహన రాగం

నా మదిలో మెలిగే ఊహల ఊపిరి
నా బావాల లాహిరి
నా ఆశల కిరణం
ఈ కవితా తోరణం
నా ఈ మోహన రాగం

ప్రకృతి:

ప్రకృతితో చెలిమిచెట్ల పచ్చదనం
ధరిత్రి నుంచి వచ్చే సుగంధం
తుమ్మెదల మకరందం
పిల్లగాలుల పలకరింపులు
కోకిల ల కుహుకుహు రాగాలు
ఎక్కడ దొరుకును ఈ కాలం లో తప్ప..